సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో మరో యువతి!

  • మహిళా పైలెట్ సరీనాతో భర్త వెంకటేశ్ కు లింకు
  • ఇద్దరూ విదేశాల్లో విహారాలు
  • ఆరోపణలు చేస్తున్న లావణ్య లహరి తల్లిదండ్రులు
ఇటీవల శంషాబాద్ లో లావణ్య లహరి అనే ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. భర్త వెంకటేశ్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని లావణ్య లహరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఈ కేసులో తాజాగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. లావణ్య తల్లిదండ్రులు అనేక విషయాలు వెల్లడించారు. లావణ్య లహరి, వెంకటేశ్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు.

లావణ్య లహరి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాగా, వెంకటేశ్ ఓ కమర్షియల్ ఎయిర్ లైన్స్ లో విమాన పైలెట్. అయితే పిల్లలు పుట్టడంలేదన్న సాకుతో ఆమెను వెంకటేశ్ తీవ్ర వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాదు, తనతో పనిచేసే మహిళా పైలెట్ సరీనాతో వెంకటేశ్ కు శారీరక సంబంధం కూడా ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణ పేరిట ఇద్దరూ కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టేవారని తెలిపారు. దీనికి సంబంధించి ఫ్లయిట్ టికెట్లు, వాట్సాప్ చాటింగ్ లు, లైవ్ చాటింగ్ ల సాక్ష్యాధారాలు ఉన్నాయని అంటున్నారు.

ఓసారి తన ఎదుటే సరీనాతో వీడియో కాల్ మాట్లాడడంతో లావణ్య లహరి భర్తను నిలదీసింది. అంతటితో ఆగకుండా సరీనాకు ఫోన్ చేసి చెడామడా దులిపేసింది. అక్కడి నుంచి వెంకటేశ్ అకృత్యాలు మరింత మితిమీరాయి. ఈ నేపథ్యంలోనే లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. తన ఆత్మహత్యకు ముందు ఓ వీడియో రికార్డు చేసిన లావణ్య లహరి... వాడంటే తనకు చచ్చేంత ప్రేమ అని, కానీ వాడు చేసే పనులు చూడలేక చచ్చిపోతున్నానని తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.

Lavabnya Lahari
Software Engineer
Suicide
Venkatesh
Pilot
Police
Hyderabad

More Telugu News